కూసుమంచి, మార్చి 2 : కష్టపడి ఆరుగాలం శ్రమించే రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సమాజానికి మంచిదికాదని హైకోర్టు రిటైర్డు జడ్జి, రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రకుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెంలో యువరైతు బుర్రా దర్గయ్య అప్పుల బాధ భరించలేక గత నెల 24న ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆ కుటుంబాన్ని రాష్ట్ర రైతు సంఘం బాధ్యులు ఆదివారం ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు లేని సమాజం ఏర్పడాలని సూచించారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.