హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29 : హనుమకొండ సుబేదారి యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజ్ (అటానమస్) కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్(Placement )సెల్ ఆధ్వర్యంలో ఫైనలియర్ యూజీ, పీజీ విద్యార్థుల కోసం ఈనెల 30, 31 తేదీలలో రెండురోజుల పాటు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో కే12 టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, హైదరాబాద్లోని ఆర్కిడ్స్ఇంటర్నేషనల్ స్కూల్ కోసం పేరెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికలు, అనుదీప్ ఫౌండేషన్ ద్వారా ప్రముఖ ఐటీఎస్ సంస్థల్లో వివిధ ఐటీ, నాన్-ఐటీ ఉద్యోగాల కోసం శిక్షణ అనంతరం నియామకాలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి అదే రోజుల్లో నమోదు ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు.
అర్హతలు:
ఫైనల్ ఇయర్ పూర్తిచేసిన లేదా చదువుతున్న యూజీ, పీజీ విద్యార్థులు. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్లేస్మెంట్ డ్రైవ్లో తప్పనిసరిగా పాల్గొని ఉద్యో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రిన్సిపాల్ జ్యోతి సూచించారు.