నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ ప్రాంతంలో వరద ప్రవాహంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది తో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
వరదలో గల్లంతు అయిన వ్యక్తి ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నాడని పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. వాగులు, నీటి ప్రవాహల వైపు ఎవరు వెళ్లొద్దని సీపీ సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో ముగ్గురు వ్యక్తులు వరదల్లో గల్లంతయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.