Narayanapet | నారాయణపేట : గణనాథుడి శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కుప్పకులిపోయాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం వెలుగు చూసింది.
నారాయణపేట జిల్లా కేంద్రంలో నిమజ్జనం సందర్భంగా గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో యువత, పెద్దలు కలిసి డీజే పాటలకు స్టెప్పులేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ వెంకటేశ్వర్లు అప్రమత్తమై.. ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడిని శేఖర్(45)గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.