యాదగిరిగుట్ట, మే22: కుటుంబ సభ్యుడి మృతికి కారణమైన బాధితుడి ఇంటి ముందు మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో అదోళనకు దిగారు. తన ఇంటిదిక్కును కోల్పోయామని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు 500 మందికి పైగా గ్రామస్తులు, బంధువులతో ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri) సాదువెల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్(32) యాదగిరిగుట్టకు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
సైదాపురం గ్రామ శివారుకు చేరుకోగానే ఎదురుగా పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన భరత్ బైక్‌పై వచ్చి వేగంగా ఢీ కొట్టాడు. దీంతో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ క్రమంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని తమకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ మృతుడి భార్య మహేశ్వరి , తండ్రి రాములు బుధవారం భరత్ ఇంటి ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.