గజ్వేల్, సెప్టెంబర్ 10: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో మంగళవారం డెంగ్యూతో వివాహిత మృతి చెందింది. అహ్మదీపూర్కు చెందిన బోయిని అనిత (34) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు గజ్వేల్లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం వైద్యులు డెంగ్యూగా నిర్ధారించడంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో మంగళవారం మృతి చెందింది. ఆమెకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు.