Mutton | నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. దీంతో అతనికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆస్పత్రికి తరలించే లోగా అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని బొందలపల్లికి చెందిన లక్ష్మయ్యగా గుర్తించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.