సిద్దిపేట : సిద్దిపేట(Siddipet )జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని(Road accident) ఓ వ్యక్తి దుర్మరణం(killed )చెందాడు. ఈ విషాదకర సంఘటన బెజ్జంకి మండలం రాజీవ్‌రహదారిపై రేగులపల్లి క్రాస్‌రోడ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్న కోడూరుకు చెందిన బాబు (38) నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాబు మృతితో చిన్న కోడూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.