హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : కేసుల పరిషారంలో రాష్ట్ర తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ ముందున్నారని ఫుల్ హైకోర్టు కొనియాడింది. ఇటీవల కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అ యిన ఆయనకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ వీడోలు సమావేశంలో జస్టిస్ శ్యాం కోషీ మాట్లాడుతూ.. జస్టిస్ సుజయ్‌పాల్ నిబద్ధత, సమర్థతను ప్రశంసించారు.
ఆయన 4,223 ప్రధాన కేసులతోపాటు 5 వేల మిస్లీనియస్ కేసులను పరిషరించారని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో పలువురు న్యాయమూర్తులతోపాటు అడిషనల్ సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్, అదనపు అడ్వకేట్ జనరల్స్ ఇమ్రాన్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.