లక్షెట్టిపేట,సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా(Manchiryala district) లక్షెట్టిపేట పట్టణంలోని ఇటిక్యాలకు చెందిన దావనపల్లి దీక్ష(12) అనే బాలిక సోమవారం డెంగ్యూతో(Dengue) మృతి(Girl died) చెందినట్లు వైద్యులు తెలిపారు. దీక్ష 15 రోజులుగా తీవ్ర జ్వరంతో అవస్థపడుతుండగా, పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించారు.
ఐదు రోజుల క్రితం ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేయగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచింది. దీక్ష ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
KTR | అమృత్ టెండర్లలో రేవంత్ భారీ అవినీతి.. బీజేపీ మౌనంపై కేటీఆర్ ఆశ్చర్యం..
Bathukamma | పువ్వులనే దైవాలుగా పూజించే పండుగ.. మన బతుకమ్మ పండుగ.. ఇవీ విశేషాలు..!
Harish Rao | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. గూండా రాజ్యం నడుస్తుంది : హరీశ్‌రావు