హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆ పార్టీ అనాలోచితి నిర్ణయాలతో రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అలవి కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తీరా గెలిచాక రైతులకు ఇచ్చిన హామీలు మరిచి మొండి చెయ్యి చూపించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తమ బ్రతుకులు బాగుపడుతాయని నమ్మిన అన్నదాతలకు చివరకు ఉరితాళ్లే దిక్కవుతున్నాయి. రుణమాఫీ కాక, వ్యవసాయం సాగక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఓ రైతు గుండె ఆగింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూ బ్‌నగర్ జిల్లా నవాబ్ పేట మండలం ఊరంచుతాండ గ్రామానికి చెందిన సోమ్లా(59) అనే రైతు 2023 డిసెంబర్ 9 కంటే ముందు బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఆ రుణం కాస్త వడ్డీతో రూ.87,300 అయింది. అర్హత ఉన్నా రుణమాఫీ కాకపోవడంతో నిత్యం అదే ఆలోచించేవాడని, ఈక్రమంలో గుండెపోటుతో మృతి(Farmer died) చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సోమ్లా మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆగిన రైతు గుండె
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం ఊరంచుతాండ గ్రామానికి చెందిన సోమ్లా(59) అనే రైతు 2023 డిసెంబర్ 9 కంటే ముందు బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఆ రుణం కాస్త వడ్డీతో రూ.87,300 అయింది.
అర్హత ఉన్నా రుణమాఫీ కాకపోవడంతో అదే… pic.twitter.com/XxsSfpcGN6
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2024