యాదగిరి గుట్ట, యాదాద్రి : యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి శుక్రవారం మొత్తం రూ. 31,32,172 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్(Main booking) ద్వారా రూ.3,24,150,కైంకర్యముల ద్వారా రూ. 3,800, సుప్రభాతం(Suprabatham) ద్వారా 9,400, పుష్కరిణీ ద్వారా రూ. 1,450 సమకూరిందని వెల్లడించారు.
వ్రతాల ద్వారా రూ. 1,39,200,ప్రచార శాఖ ద్వారా రూ. 16,650, వీఐపీదర్శనం(Vip darsan) ద్వారా రూ. 2,40,000, యాదరుషి నిలయము ద్వారా రూ.70,706, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 12,45,150 ఆదాయం వచ్చిందన్నారు. పాతగుట్ట ద్వారా రూ. 32,210, కల్యాణ కట్ట ద్వారా రూ. 67,000,శాశ్వత పూజలు ద్వారా రూ. 25,000,వాహన పూజలు(Vehicle pujas) ద్వారా రూ. 20,200,కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 4,00,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,26,948 ఆదాయం వచ్చిందన్నారు.
శివాలయం ద్వారా రూ. 10,300,అన్నదానము ద్వారా రూ. 26,768 ,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 3,44,100, క్లాక్ రూమ్ మొబైల్స్ ద్వారా రూ. 29,140 ఆదాయం ఆలయానికి సమకూరిందన్నారు.