జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal )జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక పత్తి చేనులో(Cotton field) మొసలి(Crocodile) ప్రత్యక్షమైంది. ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పత్తి చేనులో మొసలి కలకలం
జోగులాంబ గద్వాల – మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక చాకలి కందన్ సవారి యొక్క సీడ్ పత్తి చేనులో మొసలి కలకలం రేపింది.
ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురైన కూలీలు
వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం… pic.twitter.com/cFZmKh76M0
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2024