ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమేష్, స్వరూప దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
రమేష్, స్వరూప దంపతులు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి ధర్మారం వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఖాళీ ఇసుక లారీ అదుపుతప్పి ఢీకొట్టడంతో దంపతులు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.