ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 4 : ఆశించిన మేర దిగుబడులు రాక.. ఆర్థికంగా నష్టపోయిన ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకా రం. ఆసిఫాబాద్ మండలం బొందగూడ కు చెందిన పోశయ్య (55) పది ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. అనుకున్న స్థాయిలో దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోయాడు. మనస్తాపంతో సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యు లు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.