హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో ఢిల్లీలోని యశోభూమిలో చింతన్శివిర్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు సదస్సులో పాల్గొనాలని కోరుతూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ఆర్అండ్బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించారు.
సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర ప్రాధాన్యత గల అంశాలపై చర్చించి, తగిన పరిష్కార మార్గాలను రూపొందించనున్నట్టు నితిన్ గడ్కరీ లేఖలో తెలిపారు.