నారాయణపేట : కారు(Car) చెట్టును(Tree) ఢీకొట్టగా భారీగా మంటలు ఎగిసిపడ్డ(Car crashed) సంఘటన నారాయణపేట జిల్లా( Narayanapet )మాగనూరు మండల కేంద్రంలోని రోడ్డు క్యాంపు సమీపంలో గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట నుంచి మంత్రాలయంకు బయలుదేరిన కారు మాగనూరు మండల కేంద్రంలోని రోడ్డు క్యాంపు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టడంతో కారులో వేగంగా మంటలు వ్యాప్తి చెందాయి.
అదృష్టవశాత్తు కార్ డోర్లు సకాలంలో ఓపెన్ కావడంతో అందులో పయనిస్తున్న కుటుంబ సభ్యులు బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికిచేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో నలుగురు చిన్నారులు, ముగ్గురు పెద్దవారు ఉన్నట్టు తెలిసింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.