మారుతీనగర్, జూన్ 28 : గమ్యస్థానానికి చేరాల్సిన ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో మధ్యలోనే మొరాయించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికులు తెలిపిన వివరాలిలా .. మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుమ్మిర్యాల్-దోన్చందకు వెళ్తున్న క్రమంలో మెట్పల్లి పట్టణ శివారులోని ఇబ్రహీంపట్నం మూలమలుపు రాకముందు ఉన్న చడావ్ను ఎక్కలేకపోయింది.
దీంతో బస్సులోని ప్రయాణికులు కొందరు దిగి తోసినా ముందుకుకదలలేదు. దీంతో ప్రయాణికులందరూ దిగడంతో బస్సు కదిలింది. ఈ ఘటనతో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.