Kidnap | న్యాల్కల్, జనవరి 17: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాజోలి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మామిడికి గ్రామ సమీపంలో బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. దీంతో కిరాణా షాపులో పెట్రోల్ తెచ్చుకునేందుకు వెళ్లడంతో బాలుడు తప్పించుకొన్నాడు.
కుటుంబ సభ్యులు బాలుడిని వెతికేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గ్రామ సమీపంలోని పొదల్లో కనిపించడంతో ఇంటికి తీసుకెళ్లారు. బాలుడు కిడ్నాప్ విషయాన్ని తెలుసుకున్న హద్నుర్ పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడిని ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారానే వివరాలు తెలియాల్సి ఉంది.