హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కార్ బడులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 9,937 బడులను సోలార్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది.
ఇందుకుగాను రూ.289.25 కోట్ల నాబార్డు నిధులను విద్యాశాఖ ఖర్చుచేయనున్నది. ఈ బడులపై అన్గ్రిడ్ సోలార్ ప్లాంట్లను నెలకొల్పనున్నది.