నస్పూర్, నవంబర్ 21 : వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌కుమార్ దీప క్ సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో వయోవృద్ధులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించరించనున్నట్లు తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిశోర్ ఝా మాట్లాడు తూ, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం పై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో అవా ర్డు పొందిన కలెక్టర్‌ను విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా వయోవృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, డీఈవో యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.