హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్(1-10 తరగతులు) సిలబస్ మార్పు ఆలస్యం కానున్నది. దీనిపై విద్యాశాఖ కసరత్తు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. పరిస్థితిని బట్టి చూస్తే 2027-28లోనే కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.
నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్-23)ఆధారంగా 1-10 తరగతుల పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. 2026-27లో కొత్త సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.