Liquor Shops | హైదరాబాద్ : తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 4822 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. బీసీ బంద్, పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్టు బస్సులు నడువక పోవడం, కొన్ని చోట్ల బ్యాంకులు పని చేయక పోవడం లాంటి ఘటనలను దృష్టి ఉంచుకొని ఎక్సైజ్ శాఖ మద్యం షాపులకు దరఖాస్తుల గడవు ఈ నెల 23 వరకు పొడగించిన విషయం తెలిసిందే.
ఇక రంగారెడ్డి డివిజన్లో అత్యధికంగా 29,420 దరఖాస్తులు రాగా, అదిలాబాద్ డివిజన్లో అత్యల్పంగా 4154 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలకు ఈ నెల 27వ తేదీన డ్రా నిర్వహించనున్నారు. 27న ఉదయం 11 గంటలకు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రా తీయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ పరిధిలో 771, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 680, మంచిర్యాలలో 1712, నిర్మల్‌లో 991, హైదరాబాద్‌లో 3201, సికింద్రాబాద్‌లో 3022, జగిత్యాలలో 1966, కరీంనగర్లో 2730, పెద్దపల్లిలో 1507, రాజన్న సిరిసిల్లలో 1381, ఖమ్మంలో 4430, కొత్తగూడెంలో 3922, జోగులాంబ గద్వాలలో 774, మహబూబ్‌నగర్‌లో 2487, నాగర్‌కర్నూల్‌లో 1518, వనపర్తిలో 757, మెదక్‌లో 1420, సంగారెడ్డిలో 4432, సిద్దిపేట్లో 2782, నల్లగొండలో 4906, సూర్యాపేట్‌లో 2771, యాదాద్రి భూవనగిరిలో 2776, కామారెడ్డిలో 1502, నిజామాబాద్‌లో 2786, మల్కాజిగిరిలో 5168, మేడ్చల్‌లో 6063, సరూర్‌నగర్‌లో 7845, శంషాబాద్‌లో 8536, వికారాబాద్‌లో 1808, జనగామలో 1697, జయంశంకర్ భూపాలపల్లిలో 1863, మహబూబబాద్‌లో 1800, వరంగల్ రూరల్‌లో 1958, వరంగల్ అర్బన్‌లో 3175 మొత్తంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి.