మహదేవపూర్, జూన్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్‌కు( Medigadda Barrage) గురువారం 8,790 క్యూసెక్యుల వరద( Flood) రాగా, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ రక్షణ చర్యలో భాగంగా ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు గ్రౌటింగ్, షీట్ ఫైల్స్ పనులు పూర్తికాగా, అప్ అండ్ డౌన్ స్టీమ్‌లో చేపట్టిన సీసీ బ్లాక్ రీ అరేంజ్మెంట్ పనులు తుది దశలో ఉన్నాయి.
బరాజ్‌లోని మొత్తం 85 గేట్లకు 84 ఎత్తి ఉంచగా, ఏడో బ్లాక్‌లోని 20వ గేట్ కటింగ్ చేసి విడిభాగాల తొలగింపు పనులను గురువారం పూర్తిచేశారు. బరాజ్ రక్షణ చర్యల్లో బాగంగా ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు చేపట్టిన గ్రౌగింగ్,సీకెంట్ఫైల్స్ పనులు పూర్తి కాగ బరాజ్ అప్,డౌన్ స్టీమ్‌లో చేపట్టిన సీసీ బ్లాక్ రిఅరెంజ్మెంట్ పనులు తుది దశలో ఉన్నాయి. కాగా, బరాజ్ వద్ద జరుగుతున్న పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు పరిశీలించారు.