గురువారం 09 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 13:37:34

ఏపీలో కొత్తగా 813 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 813 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 25,778 మంది నమూనాలు పరీక్షించగా 813 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.  వీటిలో విదేశాలు 8, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 50 మంది ఉన్నారు. రాష్ట్రంలో 755 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

కరోనా వల్ల కర్నూల్‌లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృతిచెందారు.  రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 13098కు చేరింది. ప్రస్తుతం 7021 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనాబారిన పడి 169 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని 5908 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 


logo