హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్‌కు 78 మంది నిరుద్యోగ క్రిస్టియన్ మైనార్టీ అభ్యర్థులు ఎంపికయ్యారు. రూ.3.90 కోట్ల వ్యయంతో వాహనాలను లబ్ధిదారులకు శుక్రవారం హైదరాబాద్ టూరిజం ప్లాజాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేయనున్నారు.
క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 8-10 పదో తరగతి చదివి, 21-40 ఏండ్ల వయస్సు, లైట్ మోటర్ వెహికిల్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగ క్రిస్టియన్ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ కింద మొత్తంగా 185 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 78 మందిని అర్హులుగా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎంపిక చేసింది.