గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలు, మాంసం ఉత్పత్తులు పెంచేందుకు పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీపై సరఫరా చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజు యాదవ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన పశుసంవర్థక, పశుగణాభివృద్ధి సంస్థ, గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య, విజయ డెయిరీల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
గొర్రెల యూనిట్లు అందాల్సిన లబ్ధిదారులు తమ వాటా ధనం చెల్లించాలని సూచించారు. చనిపోయిన గొర్రెల స్థానంలో నెలాఖరులోగా కొత్తవి అందజేస్తామని తెలిపారు. సమావేశంలో పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్రావు, పశుసంవర్థకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, ఎండీ డాక్టర్ రాంచందర్, సీఈవో డాక్టర్ మంజూవాణి తదితరులు పాల్గొన్నారు.