మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జూరాలకు వస్తున్న వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 55,516 కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 317.790 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. జూరాల గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు 8.203 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.