Telangana | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఆర్అండ్బీ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు పనులు చేయబోమని కాంట్రాక్టర్లు స్పష్టంచేశారు. రూ.600 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉండటంతో కాంగ్రెస్ సర్కారుకు వారు తేల్చిచెప్పారు. ఆర్అండ్బీ శాఖ ప్రధాన కా ర్యాలయానికి వెళ్లి ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిలదీశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ శాఖ ప్రధాన కా ర్యాలయంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. బిల్డర్స్ అసోసియేషన్ మాజీ చైర్మ న్లు డీవీఎన్ రెడ్డి, దేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, కోశాధికారి సంతోశ్‌రెడ్డి, సంపత్‌రావు, కృష్ణారావు తదితరులు మంత్రిని కలిశారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.100 కోట్ల బిల్లులు ఉన్నాయని, వెంటనే మంజూరు చేయాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రితో మాట్లాడి మార్చి చివరి వారంలోగా బిల్లులు చెల్లించేలా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
15 కోట్లు మాత్రమే మంజూరు
రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖలో బిల్లులు పేరుకుపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేసేందుకు వెనకాడుతున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు నిత్యం ఆర్అండ్బీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండాపోయింది. కొత్త పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం పాత బిల్లులు చెల్లించేవరకు కొత్త పనులు చేపట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా కొత్త రోడ్ల నిర్మాణాలతో పాటు మరమ్మతుల పనుల్లోనూ తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. వానకాలంలో పోటెత్తిన వరదలకు రాష్ట్రంలో భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఆర్అండ్బీ శాఖ నష్టాన్ని అంచనా వేసి భారీగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ప్రభుత్వం మాత్రం రూ.15 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకొన్నది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
పెండింగ్ బిల్లులు ఇలా..
బడ్జెట్లో కేటాయింపులు ఇలా..