Telangana | భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బూబీ ట్రాప్స్ను గుర్తించారు. 58 బూబీ ట్రాప్స్, 3350 ఇనుప కడ్డీలను వెలికితీశారు. ఐఈడీలను నిర్వీర్యం చేశారు.