TS Dost | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు 56వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభంకాగా, మంగళవారం వరకు 10,826 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేసుకొన్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఈ నెల 30 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.