హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డు వెస్ట్ గేట్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.62 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతానికి చెందిన సహదేవ్ హంతాల్ అల్లూరికోట అటవీ ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి, తులసిపాకలోని మహ్మద్ సైఫ్, ఫిరోజ్ అనే వ్యక్తులకు చెందిన కంటైనర్‌లో గంజాయిని లోడ్ చేయించాడు.
ఈ లారీలో రహస్య అరను ఏర్పాటు చేశారు. ఏపీలోని తులసిపాక నుంచి భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహారాష్ట్ర మీ దుగా ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకు ప్లాన్ వేశారు. రీజినల్ నారోటిక్స్ కంట్రోల్ సెల్ ఖమ్మం బృందానికి సమాచారం అందడంతో కంటైనర్ లారీతోపాటు దానికి ఎసార్ట్గా వస్తున్న పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.