హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బీసీలకు రాజకీయం, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అని ప్రకటించి అధికారంలోకి వచ్చి, చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) ఇప్పు డు అవే రిజర్వేషన్ల వివాదం మెడకు చుట్టుకున్నది. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే, ఏకపక్షంగా ఆర్డినెన్స్ విడుదల చేయడం, సు ప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జీవోలు ఇచ్చి బీసీ రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగానే పీఠముడిగా మార్చిందని బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విష యం నవంబర్ మూడో తేదీన రాష్ట్ర ధర్మాసనానికి ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సి ఉం డటంతో ఏం చేయాలో తోచక తలపట్టుకున్నది.
గురువారం నాటి క్యాబినేట్ భేటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని కోర్టుకు జవా బు ఇద్దామని ఆలోచన చేసినా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోలేక భే టీని వాయిదా వేసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం హైకోర్టులో పెం డింగ్‌లో ఉన్నందున, కేసీఆర్ అమల్లోకి తెచ్చిన పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లడమా? లేక ప్రభుత్వ పరంగా కా కుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడమా? ఈ రెండే మార్గాలని మంత్రులకు సీఎం విడమరిచి చెప్పినట్టు తెలిసింది. పార్టీ పరమైన రిజర్వేషన్లు అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
చీల్చాలనే సర్కారు ఎత్తుకు విఘాతం
కాంగ్రెస్ ప్రకటించినట్టుగా స్థానిక సం స్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని బీసీ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పరమైన కోటాతోనే ఎన్నికలకు వెళ్లాలని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన తర్వాత స్టే రావడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచింది. సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం తోసిపుచ్చింది. జీవో 9పై స్టే ఉండటంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్లాలని, లేదా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లాలనే అంశంపైనే తాజాగా క్యాబినెట్లో చర్చ జరిగినట్టు సమాచారం. చివరికి ఎటూ తేల్చుకోలేక సమీక్షను నవంబర్ 7 నాటికి వాయిదా వేసినట్టు తెలిసింది.