హైదరాబాద్, నవంబర్8 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ సీలకు పార్టీపరంగా కాకుండా, చట్టబద్ధంగానే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్‌చేశారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అంబర్‌పేట చౌరస్తా నుంచి జ్యోతిరావుఫూలే విగ్రహం వరకు శనివారం భారీర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీచేసిన జీవోకు న్యాయపరమైన అవరోధాల్లేవని, న్యాయస్థానాల్లో కేసు గెలుస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా గెలిచే అవకాశముందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సం ఘం అధ్యక్షుడు భరత్‌కుమార్, వరింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, బీసీ హకుల పోరాట సమితి అధ్యక్షుడు రాజేందర్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు అంజి తదితరులు పాల్గొన్నారు.