కేసీఆర్ పాలనలో సింగరేణి సీఎస్ఆర్ నిధులను పూర్తిగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణం కోసం వినియోగించారు. రెండేండ్ల పాలనలో ప్రజలంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తన ఫుట్‌బాల్ సోకుల కోసం రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారు.
– హరీశ్‌రావు
సంగారెడ్డి, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ) : అబద్ధ్దాలు ఆడటంలో ఎవరికైనా నోబెల్‌ప్రైజ్ ఇస్తే.. అది తప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డికే వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో 4వేల సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంటే, ఆ సీట్లు కూడా తన ఖాతా లో కలుపుకొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధ్దాలు ఆడటంలో రేవంత్ నెంబర్ వన్ ఝూఠా కోర్ అని మండిపడ్డారు. సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్లను శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు ఘనంగా సన్మానించారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో 35 మంది సర్పంచ్‌లు, అందోల్‌లో మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన 72మంది సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను హరీశ్‌రావు సన్మానించారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనే విత్తనాన్ని మొలవనివ్వనని రేవంత్ ప్రగల్భాలు పలికితే గ్రామీణ ఓటర్లు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన 4వేల మంది సర్పంచ్‌లను గెలిపించారని హరీశ్‌రావు తెలిపారు. ఆయాచోట్ల సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. అహంకారంగా మాట్లాడిన రేవంత్ గుండె చీల్చుకొని గులాబీ సైనికులు విజయం సాధించారని పే ర్కొన్నారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసినా, మద్యం పంపిణీ చేసినా బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నదన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా కేసీఆర్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇది తెలిసే రేవంత్‌రెడ్డి మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కోఆప్షన్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతున్నాడని చెప్పారు.
రైతులు బుద్ధి చెబుతారని భయపడే రైతు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుం డా నామినేషన్ పద్ధతిలో చైర్మన్లను ఎన్నుకుంటామని రేవంత్ జీవో తెచ్చారని మండిపడ్డా రు. ఎప్పుడు మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లు ధైర్యం గా ఉంటూ అభివృద్ధి పనులు చేయాలని చెప్పారు. కేంద్ర నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమవుతాయని ఆ నిధులతో సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా ప్రజలు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచి 72మంది సర్పంచ్‌లను గెలిపించారని చెప్పా రు. సంగారెడ్డి నియోజకవర్గంలో సైతం 35మంది సర్పంచ్‌లు గెలిచి బీఆర్ఎస్ సత్తా చాటారని హరీశ్‌రావు అభినందించారు.
సీఎం రేవంత్ రైతులను గోసపెడుతున్నద ని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలకు సాగునీరు, కరెంటు, యూరియా అవసరమని అయితే రేవంత్ ఏ ఒక్కటీ రైతులకు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కొత్త ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి సాగునీరు అందిస్తే, రేవంత్ మాత్రం సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని ధ్వ జమెత్తారు. కేసీఆర్ రైతులకు 24గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తే, కాంగ్రెస్ పాలనలో 12గంటలు కూడా ఇవ్వడం లేదని, అందోల్ నియోజకవర్గంలో 20గంటలు కరెంటు కోతలు అమలవుతున్నదని రైతులే చెబుతున్నారంటూ నిప్పులు చెరిగారు.
రేవంత్ సంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేండ్లలో అభివృద్ధి కోసం పైసా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. జిల్లాలోని రోడ్ల్లకు గుంతలు పడినా పట్టించుకోవటం లేద ని, జహీరాబాద్ నియోజకవర్గ పర్యటనకు రేవంత్ వచ్చినా జిల్లా అభివృద్ధికి రూపాయి కూడా మంజూరు చేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రా రంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిలిపివేయడం వల్ల రైతులకు సాగునీరు అందకుండా పోయిందని మండిపడ్డారు. సింగూరు ప్రాజెక్టు కింద యాసంగిలో 40వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వకుండా రై తులను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పా రు. మరమ్మతుల పేరుతో సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నదని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు ఖాళీ, యాసంగికి సాగునీటిపై ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా రైతులను గందరగోళానికి గురిచేస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. రెండేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, తమ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన అధికారుల పనిచెబుతానని స్పష్టంచేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే బాగుండదని జిల్లా ఎస్పీని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము అభివృద్ధి పనులపై దృష్టిపెట్టాం తప్ప ఎవరి జోలికీ వెళ్లలేదని చెప్పారు. పోలీసులు ఎవరినైనా ఇబ్బందులు పెడితే తన వద్దకు రావాలని, తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మరీ అత్యవసరం అయితే తానే మీ వద్దకు వస్తానని అభయమిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజు-శ్రీజైపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాణిక్యం, జైపాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, ముకీం, మామిళ్ల రాజేందర్, నారాయణ, రాహుల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.