హైదరాబాద్,ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర కేరళ నుంచి కర్ణాటక, మధ్య మహారాష్ట్ర మీదుగా విదర్భ వరకు సము ద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. రాబోయే 4 రోజులు రాష్ట్రం లోని ఒకటి రెండు ప్రదేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధా రణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉం టుందని, పగటి వేళలో గరిష్ఠ 36, సాయంత్రం, రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలుగా నమోదవుతాయని తెలిపింది. సోమవారం ఆదిలా బాద్ లో 40.3 డిగ్రీలు, మహబూబ్నగర్ 39.8, నల్లగొండ 39.5, నిజామాబాద్ 39, రామగుండలో 39, ఖమ్మం 39, భద్రాచలం 38.6, మెదక్ 38.2, హనుమ కొండ 36.5, హైదరాబాద్ 36 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు వెల్లడించింది.