టేకులపల్లి, జనవరి 20 : నాణ్యమైన భోజనం వండి పెట్టడం లేదని, నీళ్ల చారుతో సరిపెడుతున్నారంటూ విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్లో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై కొన్ని రోజులుగా వివాదం నెలకొన్నది. భోజన నిర్వాహకులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, నీళ్ల చారు పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఇంటి నుంచే భోజనాలు తెచ్చుకుంటున్నారు.
హెచ్ఎంకు ఫిర్యాదు చేస్తే తమనే దూషిస్తున్నట్టు పలువురు విద్యార్థులు వాపోయారు. ఈ విషయమై హెచ్ఎం మంగీలాల్‌ను వివరణ కోరగా మంగళవారం 112 విద్యార్థులకు 95 మంది హాజరయ్యారని, 30 మంది బా క్స్లు తెచ్చుకున్నారని మిగతా 65 మందికి వంట చేయగా కొందరు ఇండ్ల నుంచి కూర లు తెచ్చుకొని తిన్నారని పేర్కొన్నారు.