హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఒకటో తేదీనాడే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామ ని సీఎం రేవంత్‌రెడ్డి గప్పాలు కొట్టుడు మాని సకాలంలో జీతాలివ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవుపలికారు. ఈ నెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వేతనాలందక తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొన్నదని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘ఏడాది కాంగ్రెస్ పాలనలో మీ రు సాధించిన ఘనత ఇదా? విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సై తం ఇబ్బందులు పెడుతున్నవు. హైకో ర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హకుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురిచేస్తున్నవు. ఇకనైనా ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లిం చి మాట నిలబెట్టుకోండి’ అని రేవంత్‌రెడ్డికి హరీశ్ హితవుపలికారు.