KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం పడకేసింది. నాణ్యమైన భోజనం కూడా వడ్డించడం లేదు. దీంతో గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా సిర్పూర్లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాయ్స్ హాస్టల్లో రెండు రోజుల్లో 35 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో విష జ్వరాలు విజృంభిస్తూనే ఉన్నాయని, ఇది ఆందోళనకరమని కేటీఆర్ పేర్కొన్నారు. కోదాడ నుంచి ఆసిఫాబాద్ వరకు విద్యార్థులంతా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. విద్యార్థులు విష జ్వరాలా బారిన పడకుండా ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక జ్వరాల బారిన పడిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల వెంట పంపించడం సరికాదు. ప్రభుత్వమే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రిని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
35 students at Social Welfare Gurukul Boys hostel in Sirpur are diagnosed with fevers in just 2 days!
This is yet another alarming incident in a series of crises in residential schools across Telangana. From Kodada to Asifabad, students are neglected while CM Revanth Reddy… pic.twitter.com/Z7G1H2eWya
— KTR (@KTRBRS) September 10, 2024
ఇవి కూడా చదవండి..
KTR | పసిపాప కన్నీళ్లు చూసైనా.. సర్కార్కు కనికరం కలగలేదా..! : కేటీఆర్
KTR | మంచి నీళ్లను కూడా వదలట్లేదు.. ఆ పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్
TG High Court | హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు కీలక ఆదేశాలు..!