న్యూఢిల్లీ: అజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రధాని మోదీ చాదర్‌ను సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) డిస్మిస్ చేసింది. ఆ అంశం న్యాయసమ్మితంగా లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం పిటీషన్‌ను తిరస్కరించింది. ఇస్లామిక్ గురువు ఖవాజా మొయినుద్దీన్ చిస్తీ, అజ్మీర్ దర్గాను గుర్తిస్తూ గౌరవంగా చాదర్‌ను సమర్పించడాన్ని ఓ పిటీషనర్ వ్యతిరేకించారు. జితేందర్ సింగ్ పిటీషన్ వేశారు. ఆయన తరపున బారున్ సిన్హా వాదించారు. 1947లో ప్రధాని నెహ్రూ చాదర్ సమర్పణ ప్రక్రియను ప్రారంభించారని, ఆ ప్రక్రియను నిరాటకంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిందన్నారు. అయితే చాదర్ సమర్పణ అంశంపై సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయబోదు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. శివాలయ శిథిలాలపై దర్గాను నిర్మించారని, దానికి సంబంధించిన కేసు ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉందని సిన్హా వాదించారు.