Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్దిపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ‘ఉప్పెన’తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలు, యాక్షన్ మేళవింపుతో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్న పాత్రల సమాహారంగా రూపొందుతున్న ఈ సినిమా కాస్టింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, తాజాగా ఫిబ్రవరి 15న దర్శకుడు బుచ్చిబాబు సనా జన్మదినం సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలోని విజువల్స్, ఫ్రేమింగ్, యాక్షన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ మాస్ అండ్ ఇంటెన్స్‌గా ఉండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రతి సన్నివేశం కోసం దర్శకుడు పడుతున్న శ్రమ స్పష్టంగా కనిపిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజు సినిమా సెకండ్ సాంగ్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కాని స్పెషల్ వీడియోతో సరిపెట్టారు. మరి రెండో సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తుండటం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన “చికిరి” సాంగ్ సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ సృష్టించింది. త్వరలోనే రెండో పాటను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ పాట రిలీజ్‌పై ఫిబ్రవరి చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లో మరో కీలక మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుందా అనే ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.