Punjab| పెళ్లి వేడుకలో ఆప్ నేత హత్య.. అందరూ చూస్తుండగానే కాల్చివేత
Punjab: పంజాబ్ లో ఆప్ నేత హత్యకు గురయ్యారు. పెళ్లి వేడుకలో, మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే దుండగులు అతడిని కాల్చి చంపారు.
Punjab: పంజాబ్ లో ఆప్ నేత హత్యకు గురయ్యారు. పెళ్లి వేడుకలో, మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం తార్న్ తరాన్ జిల్లాలో జరిగింది. మృతుడిని ఆప్ నేత, వాల్తోరా గ్రామ సర్పంచ్ జర్మాల్ సింగ్ గా గుర్తించారు. ఆదివారం జర్మాల్ సింగ్.. అమృత్ సర్ లోని ఓ ప్యాలెస్ కు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ కూర్చుని ఉండగా.. పిస్టల్ కలిగిన ఇద్దరు యువకులు అతడి వెనుక నుంచి వచ్చారు. అందులో ఒక వ్యక్తి జర్మాల్ సింగ్ తల వెనుక భాగంలో అత్యంత దగ్గర నుంచి కాల్చాడు.
దీంతో అతడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. కాల్చిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. జర్మాల్ పక్కనే ఉన్న వ్యక్తులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పారు. పెళ్లి వేడుకలో చాలా మంది ఉన్నప్పటికీ దుండగుల్ని గుర్తించలేకపోయారు. కాగా.. ఈ ఘటనకు తామే బాధ్యులం అని గ్యాంగ్ స్టర్స్ ప్రభ్ దాసువాల్, డానీ బల్, ఇతరులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Strongly condemn the cold-blooded murder of Sarpanch Jarmal Singh of Valtoha village (Tarn Taran), who was shot dead at a wedding function in Amritsar today.
This follows an extremely worrisome pattern: yesterday, a young man was gunned down in Bhinder Kalan (Moga) and on Friday… pic.twitter.com/nt01hEeQAn
— Sukhbir Singh Badal (@officeofssbadal) January 4, 2026
ఈ ఘటనపై అమృత్ సర్ డీసీపీ రవీందర్ పాల్ సింగ్ సంధు స్పందించారు. విచారణ జరుగుతోందని, నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే, గతంలో కూడా మూడుసార్లు జర్మాల్ సింగ్ పై హత్యాయత్నం జరిగినట్లు, వాటినుంచి ఆయన తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా పంజాబ్ లో పట్టపగలే హత్యలు జరుగుతుండటం, గన్ కల్చర్ పెరుగుతుండటంపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- AAP
- Amritsar
- Punjab
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

