Suman | అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించడంతో మొదట ఆమెకు చాలా మంది మద్దతుగా నిలిచారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేస్తూ..తన స్పీచ్‌పై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు శివాజీ. ఆ తర్వాత చాలా మంది శివాజీకి మద్దతుగా నిలుస్తూ.. అనసూయపై విమర్శలు గుప్పించారు.
కాగా సీనియర్ యాక్టర్ సుమన్ చేసిన కామెంట్స్ అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. శివాజీ ఎంపిక చేసుకున్న పదాలు తప్పు.. ఆమోదయోగ్యమైనవి కావు. ఇందుకు శివాజీ ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పాడు. అంతేకాదు ఈ చర్చను మరో కోణంలో చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు సుమన్. దివంగత లెజెండరీ తార సిల్క్ స్మితతోపాటు యాక్టర్ కమ్ డ్యాన్సర్స్ జయమాలిని, విజయలలిత గురించి చెప్పుకొచ్చాడు. వాళ్లు (సిల్క్ స్మిత, జయమాలిని, విజయలలిత) వారి పాత్రల్లో భాగంగా బోల్డ్ కాస్ట్యూమ్స్ వేసినప్పటికీ.. వారంతా తమ తమ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం చాలా సాదాసీదాగా, సాధారణంగా ఉండేవారు. సినిమా విషయానికి వస్తే రియల్ లైఫ్, రీల్ లైఫ్ భిన్నమైనని… ఆర్టిస్టులంతా ఈ తారతమ్యాన్ని అర్థం చేసుకోవాలన్నాడు సుమన్.
గతంలో యాక్టర్లు సినిమాను గొప్ప క్రమశిక్షణ, వృత్తిపరమైన గౌరవంతో చూసేవారు. వారికి ఏ దుస్తులు ఎప్పుడు వేసుకోవాలో సరైన సమయం ఎప్పుడనేది వారికి తెలుసు. పరిపక్వత, సరైన మార్గదర్శకం అనేది చాలా ముఖ్యమని చెప్పాడు సుమన్. ప్రత్యేకించి యువతరానికి అలాంటి అర్థం చేసుకునే గుణం కేవలం టైం ప్రకారమే అలవడుతుందన్నాడు. అనసూయ, శివాజీ వివాదాస్పద వ్యవహారంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించి టాలీవడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు సుమన్. మరి ఈ కామెంట్స్‌పై ఇండస్ట్రీ ప్రముఖులు ఏమైనా స్పందిస్తారా..? అనేది చూడాలి.