హైదరాబాద్ : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా పేదల కూడు,గూడును కూడా లాక్కుంటున్నది. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో గిరిజనుల ఇండ్లను రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చివేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇండ్లు కూలిస్తే మా మామకి గుండె పోటు వచ్చి వారం నుండి దవాఖానలోనే ఉన్నారు అంటూ ఓ మహిళ కంటతడి పెట్టింది. మమ్మల్ని ఖాళీ చేయించడానికి 100, 200 మంది గుండాలు, పోలీసులు వచ్చారన్నారు.
మేము ఊరికి పోతే ఇంటికి తాళం వేసి ఉందని కూడా చూడకుండా మా ఇండ్లు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో సామాన్లు అలానే ఉన్నాయి. మా పిల్లలను మా అక్క వాళ్ల ఇంట్లో పెడితే వాళ్లు పడుకున్నప్పుడే ఇల్లు కూలుస్తున్నారు. దీని వెనక రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడని ఎవరిని అడిగినా చెబుతున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. మేము ఎస్టీ వాళ్లమని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు. ఇదే వెంచర్లో పోలీసులు, లాయర్ల ఇండ్లు ఉంటే వాటిని కనీసం ముట్టుకోలేరని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి పొరపాటు చేసామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమ్మల్ని ఖాళీ చేయించడానికి 100, 200 మంది గుండాలు, పోలీసులు వచ్చారు
ఇండ్లు కూలిస్తే మా మామ వాళ్ళకి గుండె పోటు వచ్చి వారం నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు అంటూ కంటతడి పెట్టిన మహిళ
మొయినాబాద్ – పెద్దమంగళారం లంబాడాల ఇండ్లను రేవంత్ సర్కార్ కూల్చివేసిన ఘటనలో బాధితుల ఆవేదన
మేము ఊరికి పోతే… https://t.co/c7zOjtgiYm pic.twitter.com/SSD326cpCu
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2026