Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం ఓ వైపు అతలాకుతలం అవుతుండగా, మరోవైపు అనేక చెరువులు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 35 శాతం చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో 34,716 నీటిపారుదల చెరువులున్నాయి. వాటిలో నిండినవి దాదాపు 65 శాతమే. ఇందులో 6,000 చెరువులు కనీసం 50 శాతం కూడా నిండలేదు. వీటిలో 2,200 చెరువుల్లోకి 25 శాతం మించి నీళ్లు రాలేదు. హైదరాబాద్ నీటిపారుదల సరిల్లో (రంగారెడ్డి, మేడ్చల్, మలాజిగిరి) 2,599 చెరువులు ఉన్నాయి. వీటిలో 40 శాతం చెరువులు నిండనేలేదు. హైదరాబాద్లో శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో జోరుగా వర్షాలు కురిసినా ఎల్బీ నగర్, మేడ్చల్ ప్రాంతాల్లో వర్షాలు ఆశించిన మేర లేవు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. వాతావరణ లెకల ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక వర్షంపాతం నమోదైంది.
కానీ జిల్లా వార్షిక వర్షపాతం కేవలం 374 మి.మీ మాత్రమే. జిల్లాలో కురిసింది మాత్రం 734 మి.మీ. మహబూబ్నగర్ జిల్లాల్లో 400 చెరువులున్నాయి. వీటిలోకి 50 శాతం కూడా నీళ్లు రాలేదని అధికారులు చెప్తున్నారు. నల్లగొండ జిల్లాలో 1,628 చెరువులు ఉన్నాయి. ఇందులో కనీసం వేయి చెరువుల్లో 50 శాతం నీళ్లు కూడా లేవు. 124 చెరువులు నిండాయి. 144 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వరదలొచ్చాయి. ఈ జిల్లాలో 2140 ట్యాంకులున్నాయి. ఇందు లో నిండి పొర్లుతున్నవి 1800. 340 చెరువులు ఇంకా నిండాల్సి ఉంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు తెలంగాణలో 597 మి.మీ వర్షపాతం రావాలి. ఇది సాధారణ వర్షపాతం. అయితే, రాష్ట్రంలో 836 మి.మీ వాన కురిసింది. అంటే 40% ఎకువగా వానలొచ్చాయి. ఈ కాలంలో 90 రోజులు వానలుకురవాలి. కానీ ఈ సారి కురిసింది 73 రోజులే.