హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 3,038 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ఏయే ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేయనున్నారో తెలిపారు.