హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లె గ్రామానికి రిజర్వు కోటా కింద అదనంగా 300 ఇందిరమ్మ గృహాలను మంజూరుచేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. కొండారెడ్డిపల్లెకు రిజర్వు కోటా నుంచి అదనంగా 300 ఇండ్లను మంజూరు చేస్తూ గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.