హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) :కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఈ నెల 30న ‘రైతు హామీల సాధన దీక్ష’ చేపట్టనున్నట్టు బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇందిరాపార్క్ వద్ద ఉదయం 11 గంటల నుంచి 24 గంటలపాటు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్న ట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో చర్చ కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టంచేశారు.