Good news | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్ బొనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది. ఇంటిని కట్టుకోవాలను కొనే ఉద్యోగులకు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్ ఇలా అనేక రకాల భత్యాలను భారీగా పెంచింది. ఈ మేరకు ఆర్థి క శాఖ మంత్రి హరీశ్ రావు శుక్ర వారం ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. ఆ వెంటనే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణారావు సంబంధిత జీవోలను విడుదల చేశారు. ఆ జీవోల ప్రకారం.. ఉద్యోగుల ట్రావెలింగ్ అండ్ కన్వేయన్స్ అలవె న్సును 30 శాతా నికి చేరింది.
బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30 శాతం, షెడ్యూల్డ్ ఏరియాలో పని చేసే వారికీ 30 శాతా నికి అలవెన్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో పని చేసే వారికి రూ.650 నుంచి రూ.1,280, గ్రామాల్లో రూ.780 నుంచి రూ.1,430, కొండ ప్రాంతాల్లో పనిచేసేవారికి రూ.950 నుంచి రూ.1,660 అలవెన్స్‌గా లభిస్తుంది. గత సోమవారమే ఉద్యోగులకు ఒక డీఏను మంజూరుచేస్తూ తీపి కబురు అందించిన సర్కారు.. తాజాగా అలవెన్స్‌లను ప్రకటించటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అలవెన్సుల వివరాలిలా..
హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు
ఉద్యోగులు, పెన్షనర్లకు అలవెన్స్‌లను గణనీయంగా పెంచుతూ జీవోలు జారీచేయటం పట్ల టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. అలవెన్స్‌ల పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ తెలిపారు. డీఏ మంజూరు చేసిన వారంలోపే అలవెన్సులు మంజూరు చేయటం హర్షణీయమని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు అందిస్తున్న ప్రభుత్వానికి గ్రూప్-1 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హన్మంత్‌నాయక్ ధన్యవాదాలు తెలిపారు.