హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ నెల 30న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి లింగారెడ్డి, ఈటల జమున తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.